రాహుల్ చంద్రబాబు మధ్య రేవంత్ రెడ్డి…

514

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ వేరే పార్టీలకు వెళ్ళిపోయారు..మరో ప్రముఖ నాయకుడు రేవంత్ రెడ్డి తెలుగు దేశం నుంచి కాంగ్రెస్ లోకి మారిపోయినప్పటికీ చంద్రబాబుతో ఇప్పటికీ టచ్ లో ఉన్నట్టు సమాచారం.. అంతేకాదు..తరచూ దిల్లీ వస్తూ రాహుల్ గాంధీతోనూ ఆయన ర్యాపో మెంటైన్ చేస్తున్నారు. అదేసమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ పై విమర్శలూ తగ్గించింది. దీంతో.. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఈ మేరకు చంద్రబాబుతో డీల్ చేసే పని రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డి తెలుగు దేశం కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుకు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది..ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరబాద్ – ఖమ్మం – నిజామాబాద్ లలొని పలు జిల్లాల్లోని టీడీపీ నేతలను ఆయన ఇప్పటికే సంప్రదించారట. దీనిపై ఆయన అధ్యయనం చేసి ఎక్కడెక్కడ ఈ కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతుంది… టీఆరెస్ ను దెబ్బతీయడానికి ఈ కాంబినేషన్ ను ఎలా ఉపయోగించుకోవాలన్న పూర్తి వివరాలు రెడీ చేసి అటు రాహుల్ – ఇటు చంద్రబాబు ఇద్దరితో ఆ వివరాలు షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం…

మరోవైపు చంద్రబాబు ఏపీలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తున్నారు. కాంగ్రెస పై టీడీపీ నుంచి ఒక్క విమర్శ కూడా ఉండడం లేదు. అలాగే కాంగ్రెస్ నేతలూ టీడీపీని విమర్శించడం మానేశారు. మొన్నటి అవిశ్వాసంలో టీడీపీ – కాంగ్రెస్ లు కలిసి నడిశాయి. అయితే… రెండు పార్టీలూ దేనికవి గుంభనంగా ఉంటుండడంతో ఇంకా పొత్తులపై చర్చ వరకు వెళ్లలేదు. ఇప్పుడు రేవంత్ కనుక మధ్యవర్తిత్వం వహిస్తే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్- టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశం ఉంది.