రాహుల్‌ గాంధీని పప్పు అన్నది మీరు కాదా ఎవ‌రు?

394

రాజ‌కీయాల్లో శ‌త్రువులు శాశ్వ‌తంగా ఉండ‌రు, అలాగే శాశ్వ‌తంగా మిత్రులు ఉండ‌రు.. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని సీఎం చంద్రబాబు క‌లిశారు. అయితే ఇప్పుడు వైసీపీ కూడా దీనిని టార్గెట్ చేసింది. రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీల్చిందని, అలాంటి పార్టీతో ఎలా క‌లుస్తున్నారు అని వైసీపీ విమ‌ర్శించింది…విభజనతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.

Image result for rahul gandhi and chandrababu

ఇటలీ దెయ్యం సోనియాను తరిమికొట్టాలని, రాహుల్‌ గాంధీని పప్పు అని చంద్రబాబు అనలేదా అని అంబటి నిలదీశారు. అదే చంద్రబాబు ఇవాళ రాహుల్‌ను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొత్తానికి ఇలా గ‌తంలో వారే విమ‌ర్శ‌లు చేసి ఇప్పుడు మ‌ళ్లీ వారే క‌ల‌వ‌డం దేనికి సంకేతం అని సీఎం కూట‌ములు పొత్తులు లేనిదే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరు అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.చంద్ర‌బాబుకి ఇలాంటి రాజ‌కీయాలు అల‌వాటు అని గ‌తంలో ఓసారి మోదీని విమర్శించి మళ్లీ ఆయనతోనే చంద్రబాబు జోడి కట్టారని గుర్తుచేశారు.