రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన వైసీపీ సీనియ‌ర్ నేత‌లు

445

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ను నేడు క‌లిశారు, త‌మ పార్టీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌పై జ‌రిగిన క‌త్తిదాడి గురించి ఈ స‌మ‌యంలో తెలియ‌చేశారు.. ఎయిర్ పోర్టులో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం పై ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును వైసీపీ నేత‌లు రాష్ట్ర‌ప‌తికి తెలియచేశారు.ఈ ఘటనపై నిష్ప‌క్షంగా విచారణ జరగాలంటే.. థర్డ్‌ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించామని వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు… తమ అభ్యర్థనపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Image result for రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్

రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన బృందంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.. ఇక దీనిపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది ..ఇక సిట్ విచార‌ణ‌పై త‌మకు న‌మ్మ‌కం లేదు అని .. దీనిపై సీబీఐ విచార‌ణ కావాలి అని కోరుతున్నారు వైసీపీ నేత‌లు.