రావెల అవుట్ ఐదుగురు ఇన్

370

గుంటూరు జిల్లాలో చంద్ర‌బాబు కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపుతున్నారు.. పార్టీని కాదు అని వెళ్లిపోయిన వారిని ఆయ‌న ప‌క్క‌న పెట్టేస్తున్నారు..అంతేకాదు సెగ్మెంట్లో పార్టీపై దీని ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త తీసుకుంటున్నారు… తాజాగా గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాడు నుంచి గెలిచిన రావెల కిషోర్‌బాబు తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ పార్టీ కార్యక్రమాల్లో వేగం తగ్గింది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదులో అనుకున్న లక్ష్యంలో 20శాతం కూడా ఆ నియోజకవర్గంలో చేరుకోలేదు. దీంతో చంద్ర‌బాబు జిల్లా నేత‌లతో కోఆర్డినేట్ చేశారు… ప్రత్తిపాడు నియోజకవర్గంలో నడిపించే నేత లేక పార్టీ బలహీన పడుతోందని గమనించిన జిల్లా నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది…ఇక్క‌డ ఇన్‌చార్జిని నియమించి చేతులు దులుపుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి మండలానికో బాధ్యుడిని నియమించి పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

Image result for chandra babu
దాసరి రాజామాస్టారు (వట్టిచెరుకూరు)
బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ (గుంటూరు రూరల్‌)
ఇక్కుర్తి సాంబశివరావు (కాకుమాను)
రాయపాటి రంగారావు (పెదనందిపాడు)
గుంటుపల్లి నాగేశ్వరరావు (ప్రత్తిపాడు)
వీరు రంగంలోకి దిగ‌డంతో పార్టీ కార్యక్ర‌మాల్లో జోష్ వ‌చ్చింది అంటున్నారు స్ధానిక నేత‌లు.