రాయబరేలీ నుంచి ప్రియాంక పోటీ…షాక్ లో రాహుల్..

489

ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాలు నడిపిన సోనియా కుమార్తె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి సోదరి ప్రియాంక గాంధి వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఎంపి గా పొతే చేయనున్నారు..ఇప్పటివరకు సోనియా గాంధి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు..గతంలో ఆమె రాహుల్ ,సోనియా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు ప్రియాంక..సోనియా ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది…

మరోవైపు, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృ‌ష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో వ్యూహాత్మక పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు, శివసేనతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి ముందుకు వెళ్లరాదని కాంగ్రెస్ తీర్మానించుకున్నట్టు సమాచారం. రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫలితాల తర్వాతే ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.