రామోజీతో చంద్రబాబు బందం కట్…కారణం తెలిస్తే షాక్..!

691

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి..ఎప్పుడూ చంద్రబాబును తీవ్రంగా విమర్శించే రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సిఎం తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది..ఇక నుంచి చంద్రబాబు కేంద్రంపై ఎలాంటి వైఖరి ప్రదర్శించాలో ఉండవల్లి సలహాలు తీసుకోనున్నారట…దీన్ని రాజకీయంగా చూస్తే – ఇది చంద్రబాబుకు లాభం కలిగిస్తుందా నష్టం కలిగిస్తుందా అని విశ్లేషించుకుంటే…. పవన్ కల్యాణ్ జనసేనతో ఇటీవల ఉండవల్లి సంబంధాలు.. అంతకుముందు కాంగ్రెస్ లో సోనియా వద్ద ఆయనకున్న పట్టు… ఒకప్పుడు చంద్రబాబుతో బద్ధ విరోధం – ఇప్పుడు చంద్రబాబుకే సలహాలు.. కేంద్రంతో చంద్రబాబుకు పూర్తిగా బెడిసికొట్టిన సంబంధాలు.. ఇలా అనేకానేక కోణాల్లో చర్చించుకోవాల్సి ఉంటుంది. కానీ… ఉండవల్లి – చంద్రబాబు కాంబినేషన్ చంద్రబాబుకు ఎంత భారీ నష్టం కలిగించబోతోందన్నది చూస్తే సింగిల్ పాయింట్ సమాధానం ఒకటి లభిస్తోంది. అది… తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి అనధికారిక గొంతుగా ఉన్న ఈనాడు పత్రిక మద్దతు.. చంద్రబాబుకు ఈనాడు అధినేత – ఆయన రాజగురువు రామోజీ మద్దతు ఇకపై అంతకుముందున్న స్థాయిలో ఉండవనేదే ఆ సమాధానం.

ఉండవల్లి చంద్రబాబు కలయిక తో రామోజీకి వచ్చిన నష్టమేంటో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో ఉండవల్లి రామోజీకి చెందినా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించడమే కాకుండా రామోజీ రావును కోర్టు మెట్లు కూడా ఎక్కించారు…అందుకే ఉండవల్లి అంటే రామోజీ ఉలికి ఉలికి పడతారు. ఉండవల్లి వార్తలు ఈనాడు పత్రికలో కనిపించవు. అలాంటిది తన బద్ధ శత్రువును తన శిష్యుడు చంద్రబాబు ఇప్పుడు గురువుగా స్వీకరించడం రామోజీకి సుతారమూ నచ్చదు…

మరోవైపు రామోజీ ఇప్పటికే చంద్రబాబుకు ఇచ్చే ప్రయారిటీకి సమానమైన ప్రయారిటీని మోదీకి – బీజేపీకి ఇస్తున్నారు. మొన్న మోదీ దూతగా అమిత్ షా ప్రత్యేకంగా వచ్చి కలిసి నాలుగేళ్ల బీజేపీ పాలనలో సాధించిన విజయాలను ఆయనకు వివరించడమూ ఇక్కడ ప్రస్తావనార్హమే. ఇక ఇంకో విషయం ఏంటంటే… జగన్ తో రామోజీకి గతంలో ఉన్న వైరాలు దాదాపుగా సమసిపోవడం.. ఆయనకు కూడా గతం కంటే మెరుగైన కవరేజి ఇస్తుండడం.. అన్నిటికీ మించి ప్రజల నాడి పసిగట్టడంలో సిద్ధహస్తుడైన రామోజీ వచ్చే ఎన్నికల్లో జనం జగన్ కు అనుకూలంగా ఉన్నారన్న సత్యాన్ని ఇప్పటికే గుర్తించారన్నది ఈనాడు వర్గాల మాట. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇలా తన విరోధిని అక్కున చేర్చుకోవడంతో రామోజీ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే ఉండవల్లి -చంద్రబాబుల భేటీ తరువాత రామోజీ ఫిలింసిటీలో ఈనాడు పెద్దలంతా సమావేశమయ్యారని.. చంద్రబాబుకు – టీడీపికి ఇచ్చే కవరేజి విషయంలో గతంలో ఉన్నట్లు ఇకపై ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించారని టాక్. తాజా పరిణామాలతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోందని సమాచారం. నియోజకవర్గాల స్థాయి నుంచి తమకు వెన్నుదన్నుగా ఉండే ఈనాడు మద్దతు పోతే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని నేతలు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రస్థాయిలో ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి ఈనాడు పత్రిక వేసే ప్రత్యేక అనుబంధాలు ప్రతి ఎన్నికల్లో టీడీపీకి ఎంతో మేలు చేస్తుంటాయి. ఈసారి ఆ అనుబంధాల్లోనూ వ్యూహం మారొచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఉండవల్లితో కలిసి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది.