రాధాలో లగడపాటి కీలక భేటి

164

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు వంగవీటి రాధా… అయితే సెంట్రల్ సీటు విషయమే కాదు అక్కడ తనకు గుర్తింపు సరిగ్గా లేదని అందుకే పార్టీనుంచి బయటకు వచ్చాను అంటున్నారా రాధా. ఇక తెలుగుదేశంలోకి ఆయన చేరిక ఉంటుంది అని అందరూ భావించారు కాని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందులోభాగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

Image result for vangaveeti radha

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవ మానించేలా జగన్ వ్యవహరించారని రాధా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆ పార్టీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని, అయితే రాజకీయంగా కీలక నిర్ణయం కావడంతో అనుచరులు, సన్నిహితులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో తాను వేచి ఉన్నానని వెల్లడించారు. మరి రాధా ఏ పార్టీలో చేరతారు, జగన్ పై ఎలాంటి పొలిటికల్ స్కెచ్ వేస్తారో అనేది చూడాలి.