రాజ‌కీయ మ‌ద్ద‌తు పై బాబా రాందేవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

376

కాబోయే ప్రధాని ఎవరనే విషయంపై ప్రముఖ యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌స్థుతం రాజకీయాలు చాలా క్లిష్టతరంగా మారాయి. భవిష్యత్ లో దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఎవరనే విషయం చెప్పలేం అని రాందేవ్ మధురైలో వ్యాఖ్యానించారు. రామేశ్వరంలో నిర్వహించిన జాతీయ భారత్ స్వాభిమాన్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Image result for ramadeva baba
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి గాని ఏ వ్యక్తికి గాని మద్ధతు ఇవ్వనని రాందేవ్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు దేశీయ జాతీయ‌ పార్టీలు రెండూ ఆలోచ‌న‌లో ప‌డ్డాయి, ఓప‌క్క కాంగ్రెస్ బీజేపీ కూడా బాబా ఆశీస్సులు త‌మ‌కు ఉంటాయి అని అనుకున్నారు.. కాని ఆయ‌న తాజా వ్యాఖ్య‌ల‌తో ఈ రెండు పార్టీల నాయ‌కులు షాక్ అయ్యారు అనే చెప్పాలి.