రాజధానిని మారుస్తున్నాం.. వైసిపి ఎమ్మెల్యే బొత్స వ్యాఖ్యలు

54

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మరో చోటుకి తరలనుందా? ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఈ విషయమై ఊహాగానాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేలాది ఎకరాల భూమిని సమీకరించి, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని ఆయన భావించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. అమరావతి పనులకు బ్రేకులు పడ్డాయి. బడ్జెట్లోనూ రాజధానికి కేటాయింపులు పెద్దగా లేవు. దీంతో రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోనుందనేది చర్చనీయాంశంగా మారింది.

Image result for botsa satyanarayana

ఇలాంటి తరుణంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బొత్స.. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందన్నారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణం కంటే ఎక్కువగా ఉంటోందన్న బొత్స.. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. అమరావతి ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయని ఇటీవలి వరదలతో తేలిందన్నారు. వరదల నుంచి రక్షణ కోసం కాల్వలు నిర్మించాలని, వరద నీటిని బయటకు తోడాల్సి ఉంటుందన్నారు. వీటన్నింటి వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. అదనపు భారం, ప్రజాధనం దుర్వినియోగం లాంటి మాటలను బొత్స నొక్కి చెప్పడం ద్వారా అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారని భావిస్తున్నారు. రాజధానిని మరో చోటుకు మార్చే అవకాశాలు ఉన్నాయని బొత్స మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావించారు. జగన్ సీఎం అయితే దొనకొండ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తారని భావించారు. కానీ స్వల్ప తేడాతో జగన్ ఓడటంతో.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో.. రాయలసీమ, కోస్తాంధ్రకు మధ్యలో ఉన్న దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లేదంటే రాజధానిని అమరావతిలోనే ఉంచి.. పరిపాలన వికేంద్రీకరణకు తెర తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తాడో..మరి రాజదాని మార్పు విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.