రాజకీయాలపై కొణతాల క్లారిటీ

240

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరుతారు అని గత కొద్ది సంవత్సరాలుగా చర్చ అయితే జరుగుతోంది.. ఆయన ఏపీకి ఎటువంటి న్యాయం ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేయడం లేదని, ఉత్తరాంధ్రాని ఇలా వదిలేశారు అని విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన రాజకీయ రీఎంట్రీ గురించి మీడియా ప్రశ్నించగా సమాధానాలు చెప్పారు.

Image result for కొణతాల రామకృష్ణ

తాను ఏ రాజకీయ పార్టీలో లేనని…చేరమని ఆఫర్లు వస్తున్నాయని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. ఏపీ విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం దారుణమని అన్నారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలంటూ 27న విశాఖ రైల్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షను తెలియజేయడానికే రైల్ యాత్ర చేపట్టామన్నారు. ఢిల్లీ యాత్ర ముగిసిన తర్వాత కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు.అయితే తెలుగుదేశం వైసీపీ జనసేన నుంచి ఆయనకు ఆఫర్లు ఉన్నాయి మరి ఆయన ఏ పార్టీలో చేరతారో చూడాలి.