మోడీ సంచలన నిర్ణయం.. అక్టోబర్ 2 నుంచి మొదలు ..!!

77

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ప్రధానిగా ఆయన రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడో సారి ఈ కార్యక్రమంలో సంభాషించారు. ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన చేసిన ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for modi

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. ఆరోజు నుంచి దేశంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 2014లో దేశప్రధానిగా మోదీ పదవి చేపట్టిన అనంతరం స్వచ్ఛ భారత్కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని గ్రామాలు – పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని….బహిరంగా మల – మూత్ర విసర్జన రహిత దేశంగా భారత్ ను మార్చాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు – పొలిటిషియన్స్ వరకు స్వచ్ఛ భారత్ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అయినా కూడా కొన్ని చోట్ల స్వచ్ఛ భారత్ ను పాటించడం లేదు. ఎక్కడి పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. ఇప్పటి వరకు బహిరంగంగా మూత్ర విసర్జన చేసే వారి విషయంలో ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు. గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నది. బహిరంగంగా మూత్ర విసర్జన రహిత దేశంగా మార్చేందుకు సిద్ధం అయ్యింది. ఆరోజు నుంచి దేశంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. మన్ కి బాత్ లో మోడీ ఈ విషయం గురించి పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశాన్ని ఆయనకు అంకితమివ్వాలని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందనే. ఇది జరగాలి అంటే చట్టాలు కఠినంగా ఉండాలి. అంతేకాదు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేర్కొన్న ప్లాస్టిక్ రహిత భారత దేశం విషయంపై కూడా మోడీ మన్ కి బాత్ లో మాట్లాడారు. దేశాన్ని ప్లాస్టిక్ నుంచి విముక్తి కలిగించేలా సంకల్పం తీసుకుందామని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీని గుర్తుచేసుకుని అక్టోబర్‌ 2 నుంచి ప్లాస్టిక్‌ను ఏరిపారేయాలని ఏ ఇంట్లోనూ ప్లాస్టిక్‌ ముక్క ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్‌ ను నిర్మూలించేందుకు అక్టోబర్ 2 న ఓ బలమైన సంకల్పాన్ని తీసుకుందామని అన్నారు. ప్లాస్టిక్ రహిత భారతదేశం అనే మాటను చాలామంది నేతలు స్వాగతించారు. మిత్రపక్షాలే కాకుండా అటు ప్రతిపక్షంలోని సభ్యులు కూడా దీన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. మరి మోడీ చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.