మోడీ ప్రభుత్వంలో మొదటి స్కాం రాఫెల్ డీల్ అన్ని కోట్లా..!

503

నీతికి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే మోడీ ప్రభుత్వంలో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ళు మాయని మచ్చగా నిలిచింది..ఈ ఎపిసోడ్ లో భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది..మొదట ఏదో ఆరోపణ అని కొట్టి పారేసినా ఇప్పుడది బిజెపి ప్రభుత్వం మెడకు చుట్టుకుంది…రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ లో కీలకమైన ధరలకు సంబంధించిన గోపత్య క్లాజ్ ఏదీ లేదన్న విషయాన్ని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుండబద్ధలు కొట్టటం ఒక ఎత్తు అయితే.. 2008లోనే ఒప్పందం జరిగినట్లుగా చెప్పిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలో తప్పు ఉన్న విషయాన్ని ఏకే ఆంటోనీ చెప్పటం తెలిసిందే…

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎంతమేర అవినీతి జరిగి ఉందన్న అంచనాలకు సంబంధించి ఒక లెక్క వినిపిస్తోంది. దీని ప్రకారం తక్కువలో తక్కువ రూ.12వేల కోట్ల అవినీతి జరిగి ఉంటుందని చెబుతున్నారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రాఫెల్ యుద్ధ విమానం ఖరీదు ఒక్కొక్కటీ రూ.560 కోట్లు. రాఫెల్ విమానం ధర రూ.740 కోట్లు. అయితే.. ఇందులో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కోరిన భారత సర్కార్ అప్పట్లో కంపెనీని ఒప్పించింది.

ఇదిలా ఉంటే.. ఇదే విమానాన్ని ఈజిఫ్టు.. ఖతార్ దేశాలకు రూ.1319 కోట్లకు అమ్మారు. తాజాగా ఎన్డీయే సర్కారు అదే మోడీ సర్కారు ఒక్కో విమానానికి రూ.1670 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేలినట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఖజానాకు దాదాపు రూ.12632 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి మోడీ సర్కారు చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే.. యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన ఒప్పందం చాలా తక్కువకే ఉన్నా.. ఇతరత్రా కారణాల కారణంగా తుది కాంట్రాక్టుపై సంతకాలు చేయలేదని చెబుతున్నారు. ఇదిలా ఉన్నప్పుడు.. కొద్ది సంవత్సరాల అనంతరం ఒక్కోయుద్ధ విమానాన్ని ముందుగా అనుకున్న ధరకు మూడు రెట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.