మోడీ పై రసాయన దాడి చేస్తా అన్న గుర్తు తెలియని యువకుడు…హై అలర్ట్..

527

ప్రధాని నరేంద్ర మోడీకి శత్రువుల నుంచి ముప్పు ఉందని సమాచారం తెలియడంతో ఆయనకు ఎన్ ఎస్ జి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది..ఎంపి లు కేంద్ర మంత్రులను దరిదాపులకు రానీయడం లేదు..సామాన్య ప్రజానీకం అయితే అస్సలు కలవడానికి వీల్లేదు…ఈ నేపధ్యంలో ఏ చిన్న అనుమానం వచ్చినా సీరియస్ గా స్పందిస్తున్నారు భద్రతా సిబ్బంది…

తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై రసాయన దాడి చేస్తానని ఓ యువకుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్జీ) కంట్రోల్ రూముకు ఫోన్ చేసి బెదిరించాడు. కాశీనాథ్ మండల్ అనే వ్యక్తి ఫోన్ ను ట్రాక్ చేసిన పోలీసులు అతడు ముంబైలోని డీబీ మార్గ్ లో సెంట్రల్ రైల్వేస్టేషన్ లోని ట్రైన్ లో ఉన్నాడని గుర్తించారు. ముంబై పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. .

అరెస్ట్ అనంతరం విచారించిన పోలీసులకు యువకుడు అలా ఎందుకు చేశానో వివరించాడు.. కాశీనాథ్ ది జార్ఖండ్ రాష్ట్రం. సెంట్రల్ ముంబై లో ఉంటున్నాడు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టుల దాడిలో కాశీనాథ్ ఫ్రెండ్ చనిపోయాడు. ఈ విషయాన్ని విన్నవించేందుకే మోడీని కలవడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. దీంతో కోపం పెట్టుకున్న కాశీనాథ్ ఇలా బెదిరింపు కాల్ చేసి దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.