మోడీకి డైరెక్ట్ సవాల్ విసిరిన చంద్రబాబు…షాక్ లో జగన్…

660

మరికొన్ని రోజుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది..ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిని ఓడించడానికి విపక్షాలన్నీ ఒకే తాటి మీదకు వచ్చి మోడీ ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నాయి..ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ని ఓడించి దేశ రాజకీయాల్లో బిజెపి బలం తగ్గుతుందనే ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నాయి విపక్ష పార్టీలు..అయితే విపక్షాల తరపున పోటీ చేసే అభ్యర్ది ఇంతవరకూ ఖరారు కాలేదు..ఇప్పుడు ఆ విషయం కీలకంగా మారింది.. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే..

విపక్షాల అభ్యర్దిగా తెలుగుదేశం పార్టీ ఎంపి ని పోటీ చేయిస్తే ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం…బిజెపి తో తెగతెంపులు చేసుకున్న తరువాత తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు కేంద్రంలోని ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు..అదే సమయంలో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ గానీ, అటు జనసేన గానీ.. భాజపాతో కుమ్మక్కు అయి పనిచేస్తున్నాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలిగించడానిక శతథా ప్రయత్నిస్తూనే ఉంది. ఇలాంటి దుష్ప్రచారాన్ని సమర్థంగా తట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపధ్యంలో వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా బయటా తమ పోరాటాన్ని కొనసాగించడమే కాకుండా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో బిజెపి వ్యతిరేకంగా ఓటు వేసి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్…ఈ ఎన్నికలో అటు ఎన్డీయే అభ్యర్థిగా, ఇటు విపక్షాల ప్రత్యర్థిగా ఎవరు రంగంలో ఉంటారనేది ఇంకా తేలనే లేదు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున తమ ఎంపీని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా పోటీకి దించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లుగా సమాచారం.

అలా చేస్తే తాము బిజెపి తో ప్రత్యక్షంగా పోరాడుతున్న ఫీలింగ్ కలిగించి ప్రజల్లో తమ పార్టీకి ప్రభుత్వానికి పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు..ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కి మద్దతిస్తే వారితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రతిపక్ష వైసిపి నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది..అలా కాకుండా తామే అభ్యర్థిని ప్రకటిస్తే.. భాజపా వ్యతిరేక పార్టీలన్నిటి మద్దతు అడగవచ్చునని… హోదా కోసం తమ పోరాటానికి కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టడం అనేది ఆ రకంగా సులువు అవుతుందనేది ఆయన ఆలోచనగా పలువురు చెబుతున్నారు. అలాచేస్తే గనుక.. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు … తెదేపాకు ఓటు వేస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.