మేడాకు జగన్ బంప్ ఆఫర్

180

తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలోఉన్న ఏకైక ఎమ్మెల్యే, అదే గెలిచిన నాయకులలో ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.. మొత్తానికి రాజంపేట టీడీపీలో ఉన్న వివాదానికి ఎండ్ కార్డ్ అయితే తెలుగుదేశం పార్టీ లో పడింది అని చెప్పాలి. మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించిన మూడు గంటలకే హైదరాబాదు లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను మేడా సోదరులు కలిశారు. మేడా మల్లిఖార్జునరెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మేడా రాజశేఖర్‌రెడ్డితో పాటు నందలూరు సింగిల్‌విండో అధ్యక్షుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యోగీశ్వర్రెడ్డిలు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇక కొద్దిరోజులుగా పార్టీలో ఇమడలేక వైసీపీలో చేరుదాం అని భావించినా మల్లికార్జున్ రెడ్డి నేరుగా జగన్ దగ్గరకు వెళ్లారు.

Image result for మేడా రఘునాథరెడ్డి

మేడా రఘునాథరెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, లేదంటే రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మిధున్‌రెడ్డి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డికి రాజంపేట సీటు ఇస్తే రాజంపేట లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ముందుగానే హామీ తీసుకునే ఎమ్మెల్యే మేడా పార్టీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. సో రాజకీయంగా జరుగుతున్న చర్చ ఇదే రాజంపేట పొలిటికల్ కారిడార్‌లో.