మూడు స‌ర్వేలు టిక్కెట్ల విష‌యంలో బాబు కొత్త స్ట్రాట‌జీ?

271

తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేత‌ల బలహీనతలను సరి చేసుకుంటూ బలమైన అభ్యర్థులను రంగంలోని దించాలన్న ఆలోచనతో ఉంది అనేది తాజా నిర్ణ‌యాల‌తో తెలుస్తోంది. సీఎం చంద్ర‌బాబు నేరుగా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగా ఆయన సర్వే బృందాలతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా పని చేసే సర్వే సంస్థ నిర్వాహకులతో తొలుత ఆయన భేటీ అయ్యారు. వారిచ్చిన సర్వేకు సంబంధించిన అంశాలపై తనకున్న అనుమానాలను నివృతి చేసుకున్నట్లు తెలిసింది.. అందుకు అనుగుణంగా జిల్లాలవారీ సమీక్ష చేసినట్లు తెలిసింది. అదేక్రమంలో గూఢచార శాఖ అధికారులతో కూడా నియోజకవర్గాల వారీ, జిల్లాల వారీ సర్వే జరిగిన తీరుతెన్నులపై సమీక్ష చేసినట్లు తెలిసింది.

Image result for chandra babu

ప్రత్యేకించి కొన్ని జిల్లాల ఇంటెలిజెన్స్‌ అధికారులను పిలిపించుకొని వారితో సర్వేపై ప్రత్యేకంగా మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఎంతమేర సక్రమంగా జరిగిందన్న విషయంపై సమీక్షించారు. ఇలా మూడు రకాల సర్వేలపై జిల్లాల వారీ అందులోని నియోజకవర్గాలవారీ స్వయంగా సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడైనా అనుమానాలుంటే నాలుగో వైపు నుంచి పార్టీ వర్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఈ సర్వేల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది.