మూడు నెలల్లో టీడీపీ లోకేష్ కథ తెలుస్తుంది

296

తెలుగుదేశం పార్టీలో దొడ్డిదారిన మంత్రి పదవి సాధించారు అని, అందులో మంత్రి లోకేష్ ఒకరు అని విమర్శించారు వైసీపీ నేత కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు.. ఇలా లోకేష్ దొడ్డిదారిన పదవులు తీసుకుని మీరు జగన్ ని విమర్శిస్తున్నారు అని ఇలాంటి వారికి జగన్ను విమర్శించే హక్కులేదు అని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు.

Image result for lokesh babu

సీఎం కుమారుడు కాకపోయి ఉంటే లోకేష్ దేనికీ పనికి వచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్సార్ వారసుడిగానే కాకుండా.. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడిగా ప్రజలు వైఎస్ జగన్ను చూస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి అండతో మంత్రి అయిన లోకేష్కు, స్వయంగా ఎదిగిన వైఎస్ జగన్కు ఉన్న తేడాను ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. మరో మూడు నెలల్లో టీడీపీ, లోకేష్ కథేంటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు… జగన్ కు ప్రజల్లో మద్దతు వస్తోంది అని దీనిని తట్టుకోలేక ఇలాంటి రాజకీయాలు విమర్శలు జగన్ పై చేస్తున్నారు అని జగన్ పై ఎన్ని ఇలాంటి విమర్శలు చేసినా గెలుపు తథ్యం అని అన్నారు ఆయన.