ముఖ్య‌మంత్రి ఎవ‌రు అనేదిక్లారిటీ ఇచ్చిన రాహుల్

394

నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నాం కానీ, సాకారం కాలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు కావ‌డంతో ఆయ‌న వివిధ ప్రాంతాల్లో ప్ర‌సంగాలు చేశారు స‌భ‌ల్లో పాల్గొన్నారు.. నగరంలోని ఓ హోటల్‌లో కూటమి నేతలందరూ కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలే ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు.

Image result for rahul gandhi

ఇక్క‌డ ప్ర‌జ‌లు మార్పుని కోరుకుంటున్నారు అని అన్నారు ఆయ‌న‌.. కాంగ్రెస్ కూట‌మి గెల‌వ‌డం ఖాయం అని రాహుల్ తెలియ‌చేశారు..ఈ దేశానికి రైతులే వెన్నెముక అని, రైతులను అటు మోదీ, ఇటు కేసీఆర్ ఇద్దరు మోసం చేశారని రాహుల్ విమర్శించారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నను విలేకరులు వేసినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పలేమని, కేసీఆర్‌ని గద్దె దించడమే తమ ముందన్న ప్రధాన లక్ష్యమని రాహుల్ స్పష్టంచేశారు.