మీకు సరైన మొగుడు మోడీనే .. ఇక కాసుకో పాకిస్థాన్ .

74

2016 యూరి అటాక్స్, 2019 పుల్వామా.. ఇలా భారత్ పాక్ ల మధ్య వివాదాలు తలెత్తుతునప్పుడల్లా సింధు జల ఒప్పందం తెరమీదకు వస్తుంది. ఎందుకంటే భారత్ పాక్ ల మధ్య ఉన్న చాలా ఒప్పందాలను పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. అసలు ఈ జలసంధి అంటే ఏమిటి.. దాని గురించి పూర్తీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for modi and imran khan

భారత్‌ నుండి పలు మార్గాలలో పాక్‌కు వెళ్లే జలాలను 1948లో భారత్‌ నిలిపేసింది. కాని తరువాత దానిని పునరుద్ధరించింది. పలు గ్రామాలకు సరఫరా అవుతున్న నీటిని నిలిపివేయడంతో భారత్‌ను పాక్‌ తీవ్రంగా విమర్శించింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుని జలాల్లో-వాటాల పంపిణీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో రూపొందిందే సింధూ నది జలాల ఒప్పందం (ఐడబ్ల్యుటి). ఈ ఒప్పందం మేరకు సింధు, చినాబ్‌, జీలం, బియాస్‌, రావి, సట్లజ్‌ అనే ఆరు నదుల జలాలు భారత్‌ -పాక్‌ల మధ్య పంపిణీ జరగాలి. సింధు జలాల ఒప్పందం ప్రకారం.. సింధు ఉపనదులైన సట్లజ్, రావి, బియాస్‌లను భారత్‌కు కేటాయించారు. చినాబ్, జీలం, సింధు నదులను పాకిస్థాన్‌కు కేటాయించారు. మొత్తం సింధు జలాల్లో 20 శాతం భారత్‌కు కేటాయించారు. తనకు కేటాయించిన జలవనరుల్లో భారత్ 93-94 శాతం వాడుకుంటోంది. మిగతా జలాలను వృథాగా పాకిస్థాన్‌కు వదిలేస్తోంది. 1960లో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది.

Image result for modi and imran khan

అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దాదాపు 9 సంవత్సరాలు చర్చలు జరిపి ప్రపంచ బ్యాంకు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందం మేరకు తూర్పు నదులైన బియాస్‌, రావి, సట్లెజ్‌లపై భారత్‌కు నియంత్రణ ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, చీనాబ్‌, జీలం నదులపై పాక్‌కు నియంత్రణ ఉంటుంది. భారత్‌కు కేటాయించ బడిన మూడు నదులలోని మొత్తం 1680 లక్షల ఎక్రీ ఫీట్‌కు ( ఒక ఎక్రీఫీట్‌ అంటే సుమారు 43, 560 క్యూబిక్‌ అడుగులు) గాను, భారత్‌ 330 లక్షల ఎక్రీ ఫీట్‌ అంటే సుమారు 20 శాతం జలాలను భారత్‌ పంపిణీ చేయాలి. భారత్‌ తనకు కేటాయించిన వాటాలో 94 శాతం జలాలను ఈ ఒప్పందం కింద ఉపయోగించుకుంటుంది. మిగిలిన నీటిని పాక్‌కు వదిలివేస్తున్నది. ఒప్పందం మేరకు భారత్‌-పాక్‌లకు చెందిన జల విభాగ కమిషనర్లు ఏడాదికి రెండు సార్లు సమావేశమై ఆయా నదులను సందర్శించి అక్కడ సాంకేతికంగా తలె త్తే సమస్యలతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై చర్చించి పరిష్కరించుకోవాలి.

Image result for modi and imran khan

అదే సమయంలో రెండు దేశాలు కూడా ఎంత మొత్తంలో జలాలను పంచుకున్నాయి. వాటిని ఏ మేరకు ఉపయోగించకున్నాయో గణాంకాలతో సహా వివరాలను ఇచ్చి పుచ్చుకోవాలి. నదీజలాల వినియోగానికి సంబంధించి రెండు దేశాల మధ్య సమాచార, సహకార పంపిణీలకై ఈ విధమైన యంత్రాంగాన్ని రూపొందించుకున్నారు. వాస్తవానికి ఈ ఒప్పందం పూర్తిగా పాకిస్థాన్‌ కు అనుకూలంగా ఉంది. ఆ తరహా ఒప్పందానికి భారత్‌ ఎలా అంగీకరించిందన్నదే అసలైన సందేహం. ఆనాటి ప్రపంచ రాజకీయ స్థితిగతుల్లో సోవియట్‌ యూనియన్‌ ను కట్టడి చేయడానికి అమెరికా, బ్రిటన్‌లు ప్రయత్నిస్తున్నాయి. భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ తమకు ఎంతో అవసరమని ఆ దేశాలు భావించాయి. దాంతో ఆ రెండు దేశాలూ పాకిస్థాన్‌ కే అనుకూలంగా నిలిచాయి. అభివృద్ధి నిధుల రూపేణా అమెరికా, బ్రిటన్‌ల సహకారం కోసం ఎదురుచూస్తున్న భారత్‌ సైతం ఏకపక్ష ఒప్పందాన్ని వ్యతిరేకించలేకపోయింది. ప్రపంచ బ్యాంకు తోడ్పాటూ అవసరం కావడంతో భారత్‌ నోరు మెదపలేకపోయింది. 1965, 1971, 1999లో జరిగిన యుద్ధాల్లోనూ భారత్‌ ఆ ఒప్పందాన్ని గౌరవించింది. ద్వైపాక్షిక ఒప్పందాల పట్ల భారత్‌ కు గల నిబద్ధతకు ఇదే నిదర్శనం. అయినా భారత్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ గగ్గోలు పెట్టడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. ఒప్పందం ప్రకారం సాగు, తాగు, విద్యుత్‌ అవసరాల కోసం భారత్‌ ఆ నదీ జలాలను వినియోగించుకోవచ్చు. నిజానికి పాక్‌ను ఎడారిగా మార్చాలంటే ఈ ఒక్క నిబంధనను సరిగ్గా ఉపయోగిస్తే చాలు! మన హక్కులను నిక్కచ్చిగా వినియోగించుకోవడం ద్వారా పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

కానీ, భారత్‌ ఏనాడూ ఆ మార్గంలో వెళ్లలేదు. అయితే అదంతా గతం. ఇప్పుడు వచ్చింది మోడీ. యూరి అటాక్స్ తర్వాత సింధు జలాల ఒప్పందం మీద దృష్టి పెట్టాడు. ఇక్కడ ప్రాజెక్ట్ లు నిర్మించి నీళ్లను ఎక్కువగా వాడుకోవాలని భారత్ అనుకుంటుంది. దీనికి సంబందించిన ప్రాజెక్ట్ ల పనులు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రీసెంట్ గా కాశ్మీర్ 370 ఆర్టికల్ ను రద్దు చేసి పాక్ కు పెద్ద దెబ్బనే కొట్టాడు. అందుకే పాక్ అమెరికా సహాయం అడుగుతుంది. అయితే పాక్ ఇలాగే విర్రవీగితే సింధు నది ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తా అని హెచ్చరించాడు మోడీ. ఈ విషయాన్నీ నితీష్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు. పాక్ సరిగ్గా ఉంటె ఓకే లేకుండా అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించాడు. చూడాలి మరి మోడీ ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటాడో.