మరో మూడు టిక్కెట్లు ఒకే చేసిన బాబు

305

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ఓ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఫిక్స్ చేశారు.. ముందుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోటీకి సిద్ధం కమ్మని స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటంతో పాటు పలురకాల అంశాలకు సంబంధించి ఏలూరి ద్వారా తెలుసుకున్నట్లు తెలిసింది. ఇక తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. తిరిగి గిద్దలూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే పలు అంశాలపై సూచనలు, జాగ్రత్తలు చెప్పినట్లు తెలిసింది.

Image result for tdp

తాజా పరిస్థితులను అశోక్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్తూ కిందిస్థాయిలో పలు చేర్పులు మార్పులు ఉండవచ్చని అయినా గెలుపు మనదేనని అంటూ అందుకు ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇక మంత్రి శిద్దారాఘవరావుతో చర్చించిన బాబు జిల్లా రాజకీయాల గురించి చర్చించారు.. అంతేకాదు సెగ్మెంట్లో ఎటువంటి పరిస్దితులు ఉన్నాయి.. పార్టీ తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటివి అన్నీ మంత్రిగా నాయకుల్ని అక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలి అని బాబు మంత్రికి తెలియచేశారు.