మరో నేతకు టీడీపీ ఆహ్వానం

234

ఎన్నికల ఏడాది కావడంతో కొత్త నాయకులతో వైసీపీ టీడీపీ జనసేనలో కొత్త జోష్ అయితే కనిపిస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వనం అందిందని, పార్టీ పిలుపు మేరకు తాను రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను కూడా తెలుగుదేశంతోనే పయనించాలన్న నిర్ణయంతో ముందుగానే తన ఉద్ధేశాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు.ఇక వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తాను అని తెలిపారు ఆయన.

Image result for ఉగ్రనరసింహారెడ్డి
తాను తీసుకునే రాజకీయ నిర్ణయానికి ఉగ్రసేన సభ్యులు, అభిమానులు అంతా మద్దత్తు పలకడం అనందంగా ఉందన్నారు. బుధవారం కనిగిరిలోని పవిత్ర పంక్షన్హాలులో ఉగ్రసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి ఆనాడే నిమ్జ్ను ప్రతిపాదించి కనిగిరి ప్రాంతానికి తీసుకువచ్చానన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ది కంటే తిరిగి మరింత అభివృద్ది సాధిస్తానని, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించి ప్రజల నీటి కష్టాలు తొలగిస్తానన్నారు.మరి ఆయన ఎంట్రీతో ఇక్కడ జనసేన వైసీపీ నుంచి ఎలాంటి పోటీ ఉంటుందో చూడాలి.