మరో కీలకనేతకు బాధ్యతలిచ్చిన జగన్

321

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల సమయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ప్రతీ సెగ్మెంట్లో ఎన్నికల పరిశీలకులని కన్వీనర్లని నియమిస్తున్నారు. ఇది అభ్యర్దికి ఎంతో సులువుగా సాయం అయ్యేందుకు ఉపయుక్తం అవుతుంది అని భావిస్తున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా రాయచోటికి చెందిన వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ 2019 ఎన్నికలు ముగిసేంతవరకు అక్కడ ఉండి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మండపల్లె రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తిరుపతి అసెంబ్లీ స్థానంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అత్యధిక మెజార్టీతో అభ్యర్థి గెలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇక మిగిలిన సెగ్మెంట్లకు కూడా జగన్ ఇప్పటికే నేతలను సిద్దం చేస్తున్నారని సమాచారం.