మంత్రి లోకేష్ పోటీ చేసే సెగ్మెంట్ ఫిక్స్

122

మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే, ఎవరూ సరైన సెగ్మెంట్ పేరు చెప్పలేకపోతున్నారు.. విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేస్తారు అని నిన్నటి వరకూ వార్తలు వినిపిస్తే, ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గుంటూరు జిల్లాలో ఆయన పోటికి సిద్దం అవుతున్నారు అని తెలుస్తోంది.

Image result for nara lokesh
 మంత్రి నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.  గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. నేడు పలు దఫాలుగా చర్చించిన అనంతరం టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపు విడుదలయ్యే జాబితాలో లోకేష్ పేరు ఉంటుందని సమాచారం. ఇక్కడ నుంచి ఆయనని బరిలోకి దింపడానికి కారణం కూడా ఉంది.. గుంటూరు జిల్లా కావడం అలాగే మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఉండవల్లిలోనే లోకేష్కు ఓటు ఉంది. వీటి వల్ల లోకేష్ ని ఇక్కడ నుంచి బరిలోకి దించాలి అని చూస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే మళ్లీ టికెట్ ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక విశాఖలో ఇప్పటికే బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇద్దరూ ఒకే జిల్లా నుంచి అయితే కొందరి నుంచి వ్యతిరేకత వస్తుంది అని ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.