మంత్రి చెప్పారు బాబు ఫాలో అయ్యారు?

316

కేంద్రం ఏపీకి చేసిన సాయం ఏమీ లేదు అని. అందుకే తెలుగుదేశం పార్టీ కేంద్రం పై అవిశ్వాసం పెట్టింది అనేది తెలుగుదేశం నేత‌లు చెప్పేమాట‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదాఇస్తాము అని మాట‌మార్చిన బీజేపీ పై గ‌తంలో వైసీపీ అలాగే తెలుదేశం వేరు వేరుగా అవిశ్వాస తీర్మాణం పెట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ విష‌యం పై మంత్రి పితాని కొన్ని కీల‌క విష‌యాలు తెలియ‌చేశారు.

Image result for పితాని సత్యనారాయణ
పార్లమెంటులో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ మద్దతు కోరాలని తానే ప్రతిపాదించినట్లు ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంతరంగిక చర్చల్లో అందరూ కాంగ్రెస్ మ‌ద్ద‌తు వద్దన్నారని అన్నారు. హక్కుల సాధన కోసం కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. మొత్తానికి మంత్రిగారి మాట సీఎంగారు కూడా విన్నారు అని అంటున్నారు నేత‌లు .