బ్రేకింగ్ న్యూస్…జనసేన లోకి మోత్కుపల్లి

643

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా పనిచేస్తానన్న తెలంగాణ టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు…టిడిపి నుంచి సస్పెండ్ అయిన తరువాత ఆయన ఏ పార్టీలో చేరలేదు..గతంలో వైసిపి నేత విజయ సాయి రెడ్డి కూడా మొత్కుపల్లిని కలిసి పలు అంశాలపై చర్చించారు..దీంతో తెలంగాణ వైసీపీలోకి మోత్కుపల్లి అంటూ పలు ఊహాగానాలు వినపడ్డాయి…

గురువారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మోత్కుపల్లి కలవనుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది..తెలంగాణ జనసేన బాధ్యతలను మోత్కుపల్లి తీసుకుంటారని వార్తల్ఉ వెలువడుతున్నాయి..దళిత నాయకుడిగా తెలంగాణ లో మంచి పట్టున్న నేతగా మోత్కుపల్లి కి తెలంగాణ జనసేన బాధ్యతలు అప్పగించాలని పవన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది..ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తున్నాయి.

ఇప్పటికే టార్గెట్ చంద్రబాబు అంటూ మోత్కుపల్లి తనదైన శైలిలో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో పర్యటించి చంద్రబాబు మోసాలను ఎండగడుతానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడంపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు జనసేన కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పవన్‌తో భేటీ ప్రాముఖ్యత గురించి మోత్కుపల్లి వన్‌ ఇండియా తెలుగుతో మాట్లాడారు. చంద్రబాబు వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా జనసేనానిని కలుస్తున్నట్లు వివరించారు. పవన్ కళ్యాణ్‌తో సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తారని తెలిపారు.