బ్రేకింగ్: కరుణానిధి మృతి.. హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.. |

535

94 ఏళ్లు పూర్తయిన కరుణానిధి అనారోగ్యంతో  ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన గత 11 రోజులుగా  కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన చనిపోయిన వార్త ప్రకటించ డానికి ముందు తమిళనాడు లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దఎత్తున  భద్రతాబలగాలను చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద   మోహరించారు.

‘సీనియర్ మోస్ట్ నాయకుడిని కోల్పోయాం’: ప్రధాని మోదీ

భారతదేశంలో ఒక సీనియర్ నాయకుడు కరుణానిధి  మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు .. అని ప్రధాని ట్వీట్ చేశారు.

రజనీ కాంత్ స్పందిస్తూ.. ‘‘ఇది నా జీవితంలో చీకటి రోజు.. ఈరోజును నేను ఎప్పుడూ మరచిపోలేను’’ అని తమళ భాషలో ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్ వేదికగా కరుణానిధి మృతి పట్ల సంతాపం తెలిపారు.

భారత్ గొప్ప బిడ్డను కోల్పోయింది’: రాహుల్

‘తమిళ రాజకీయాల్లో 6 దశాబ్దాల ప్రయాణంలో తనదైన ముద్ర వేసిన కరుణానిధిని.. తమిళ ప్రజలు ఎంతగానో ప్రేమించారు. తమ అభిమాన నాయకుడిని కోల్పోయిన లక్షలాది మంది అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

కరుణానిధికి సంబంధించిన ముక్యమైన విషయాలు

సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగురేసే హక్కు కరుణ వల్లే దక్కింది.

కరుణానిధి 2 లక్షలకు పైగా పేజీలు రాశారు.

ఆయన తన పార్టీ అధికారిక పత్రిక ‘మురసోలి’లో రాస్తున్న ‘ఉదాన్‌పిరప్పి’ (ఓ సోదరుడా…) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓటమి ఎరుగని నాయకుడు కరుణానిధి

కరుణానిధి 1947 నుంచి 2011 వరకూ దాదాపు 64 సంవత్సరాల పాటు సినిమాలకు సంభాషణలు రాశారు.

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకుల్లో కరుణ ఒకరు.