బొత్స సత్యనారాయణను మంత్రి పదవి నుంచి పీకేస్తున్నారా?

263

వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పదవి కాలం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అని మొదటిలో జగన్ చెప్పాడు. మంత్రుల పనితీరుని బట్టి కొనసాగించటమా, తొలిగించటమా అనేది ఉంటుందని జగన్ చెప్పటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలలోపే ఇద్దరు మంత్రులకి పదవి గండం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. వాళ్లలో ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి మూణ్నాలు ముచ్చటగానే మిగిలిపోనుందా అంటే అవునననే సమాధానం వస్తుంది. బొత్స సీనియర్ నేత కావటం, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ కి సన్నిహితుడు కావటంతో గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చాడు జగన్. అయితే అతని నోటి దురుసు కారణంగా లేని పోనీ సమస్యలు తీసుకోని వస్తున్నాడని, అలాగే ఆయన నిర్వహించే శాఖలో చేతివాటం ఎక్కువ అయ్యిందనే మాటలు కూడా వినిపించటంతో జగన్ బొత్స విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Image result for botsa satyanarayana

బొత్స రాజధాని విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయంగా జగన్ ను అందరు విమర్శిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని, రాజధాని నిర్మాణంలో ఖర్చు చేయాల్సిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేశారని నిధుల దుర్వినియోగం పైనా విచారణ జరుగుతోంది. అలాగే అమరావతి వరదలను తట్టుకునే శక్తి లేదు. ఎప్పుడు వరదలు వచ్చినా అమరావతి మునిగిపోతుంది కాబట్టి రాజధానిని మారిస్తేనే మంచిదని బొత్స కామెంట్స్ చేశారు. ఇలా బొత్స చేసిన కామెంట్స్ విపక్షాల నుంచి విమర్శలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని మారుస్తారని వచ్చిన వార్తల వలన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇలా బొత్స వలన సమస్యలు వస్తున్నాయి.. ఇంకా కొనసాగితే మరిన్ని సమస్యలు వస్తాయని జగన్ అలోచించి బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించాలని జగన్ అనుకుంటున్నాడంట.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే మరో యువ మహిళా నేతకి కూడా జగన్ పెద్ద పదవి అప్పగించాడు. ఆమెకు అనుభవం లేకపోయినా కూడా మంత్రి పదవి అప్పజెప్పాడు. ఆమెకి మంత్రి పదవే కష్టం అనుకుంటే ఏకంగా నెంబర్ 2 పదవిని ఇచ్చాడు. భాద్యతలను నిర్వర్తించడంలో ఆమె పూర్తిగా విఫలం అవుతుంది. ఆమెకి సహాయకుడిని పెట్టిన కానీ ఆమె పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవటంతో జగన్ ఆమెకి కూడా మంత్రి వర్గం నుండి తొలగించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.అలాగే ఇంకా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది. ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. జనాలు ఏమనుకుంటున్నారు.. ఇలా అనేక విషయాలను త్వరలో పరిశిలించి మరికొందరి మీద కూడా వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. వీరి స్థానంలో రోజా, అంబటి రాంబాబులకు మంత్రి పదవి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ వీరి మంత్రి పదవులను ఉంచుతాడో తీసేస్తాడో.. మరి బొత్సను , మహిళా మంత్రిని పదవుల నుంచి జగన్ తీసేస్తున్నాడని వచ్చిన వార్తల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.