బైరెడ్డి రూటు ఎటు

195

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ప్రశ్నలపై నేడో, రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది….రాయలసీమ పరిరక్షణ సమితి నుంచి బయటకు వచ్చి ఆయన తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారు.. కాని ఆయన కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఇమడలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు,.

Image result for byreddy rajasekhar reddy

ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చిన సీట్ల వివాదం ఆదిప్యత పోరుగా తెరతీసింది. కర్నూలు డీసీసీ అధ్యక్షుని నియామకం.. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులపై ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు.. కాంగ్రెస్ హై కమాండ్కు తలనొప్పిగా మారింది. రఘువీరారెడ్డి విధానాలు నచ్చకే బైరెడ్డి పార్టీని వీడుతున్నారా? లేక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్కు కటీఫ్ ఇస్తున్నారా? అనేది చర్చనీయాంశమైంది.ఇక పార్టీ నుంచి ఆయన బయటకు రావడం పక్కాగా తెలుస్తోంది ఇక ఆయన వైసీపీ తరపున కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు వైసీపీ నాయకులు.. ఇటు తెలుగుదేశం నాయకులు కూడా బైరెడ్డితో టచ్ లో ఉన్నారు అని అంటున్నారు సో చూడాలి ఆయన డెసిషన్ ఎలా ఉండబోతోందో.