బుల్లెట్ పై వ‌చ్చి కేసీఆర్ ని క‌లిసిన అస‌దుద్దీన్

359

తెలంగాణ రాజ‌కీయాలు చాలా ఆసక్తిగా మారిపోయాయి.ముఖ్యంగా ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు ఎలాంటి రాజ‌కీయాలు అయినా జ‌ర‌గ‌వ‌చ్చు అందుకే హంగ్ వ‌స్తే ప‌రిస్దితి ఏమిటి అనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఇప్ప‌ట‌కిఏ ఎంఐఎం బీజేపీతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు అని తెలుస్తోంది… మ‌రో ప‌క్క బీజేపీ దూరంగా ఉన్నా, కేసీఆర్ ఎంఐఎంతో క‌ల‌వ‌క‌పోతే తాము కేసీఆర్ కు స‌పోర్ట్ చేస్తాము అని చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాట్లాడారు.

Image result for owaisi

అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు రోజు ఇరువురి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగ్ ఏర్పాడితే ఏం చేయాలన్న అంశంపై వారు చర్చలు జరిపారు. అయితే అసదుద్దీన్ అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ ఒంటరిగా బుల్లెట్‌సై స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్‌కు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా ఉంది. కేసీఆర్, అసదుద్దీన్ ఏం మాట్లాడతారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో హంగ్ వస్తే తమతో చేరాలని కూడా కాంగ్రెస్ ఎంఐఎంను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. అసదుద్దీన్ చేజారిపోకుండా ప్రయత్నాలు ప్రారంభించారు.