బీజేపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు షాక్ లో జగన్

66

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఇకమీదట దేశమంతటా ఒక్క బీజేపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బలోపేతం కావడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. కాగా ఈ ప్రయత్నాన్ని ముందుగా రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రారంబంచిందని చెప్పాలి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రెండోసారి బీజేపీ అధికారంలోకి రాకూడదు అని భావించారు. బద్ద శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ తరపున రాహుల్ ని ప్రధానిని చేద్దాము అని భావించారు.కాని ఈ ఎన్నికల్లో దారుణంగా కాంగ్రెస్ ఓడిపోయింది, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఓటమి పాలైంది, కనివినీ ఎరుగని ఓటమి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ స్దాపించిన ఇన్ని సంవత్సరాలలో, అసలు ఇలాంటి ఫలితాలు ఎన్నడూ రాలేదు, వైయస్ జగన్ పై విశ్వాసం చంద్రబాబు పాలనపై విసుగుతో ప్రజలు ఇలాంటి ఫలితాలు ఇచ్చారు అనేది వైయస్సార్ పార్టీ శ్రేణులు చెప్పే మాట.

ఈ క్రింద వీడియో చూడండి

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష స్ధానంలో ఉన్నటువంటి టీడీపీ లో అసమ్మతిగా ఉన్నటువంటి నేతలందరినీ తన పార్టీలో కలిపేసుకుంది బీజేపీ. ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వారితో పాటే ఓడిపోయినవారందరిని కూడా బీజేపీలో కలిపేసుకున్నారు బీజేపీ పెద్దలు. అంతేకాకుండా ఈ నెల 18న ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు … నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబుకు వెన్నంటి ఉన్న నేతలను ఆ బీజేపీలో చేర్చుకున్నారు.. ఇక ఇపుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మీద బీజేపీ కన్ను పడింది… ఓ పక్క తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత చూపిస్తూ, వైసీపీతో మిత్ర బంధం కొనసాగిస్తూ ఉన్న బీజేపీ, మరో కొత్త ప్లాన్ వేస్తోంది అని తెలుస్తోంది.

Image result for modi and jagan

ఇపుడు ఏపీలోనూ వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరతారని ప్రచారం జోరందుకుంది. అది కూడా గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీకి అండగా ఉంటున్నటువంటి రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేతలు అని సమాచారం. ఇకపోతే ఆ ఇద్దరు ఎంపీలుకూడా వైసీపీ పార్టీలో చాలా కీలకమైన నేతలని సమాచారం. కానీ ఇదంతా ఒక మైండ్ గేమ్ అని, వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరుతారనే వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ ఇవే నిజమైన వార్తలని ఆ ఎంపీలకు సంబందించిన వారు కొందరు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. పైగా జగన్ తో స్నేహ పూర్వంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఎత్తులు వేస్తుంది అని మరో వాదన వస్తోంది.. నిజంగా ఎన్నికల సమయం అయితే ఇది జరుగుతుంది. కాని ఎన్నికలు అయి రెండు నెలలు మాత్రమే అయింది. అందుకే ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు అంటున్నారు పార్టీ శ్రేణులు. మరో పక్క తెలుగుదేశం నేతలు మాత్రం తమ నేతలను చేజార్చుకోకూడదు అని చూస్తున్నారు.. అయితే ఒకవేళ నిజంగానే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరిపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి, ఫిరాయింపుల విషయంలో ఐదు సంవత్సరాలు జగన్ ఎలాంటి పోరాటం చేశారో తెలిసిందే.