బీజేపీపై త‌న స్టాండ్ చెప్పిన ప‌వ‌న్

446

ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీ క‌లిసిపోతాయా బీజేపీకి ప‌వ‌న్ ద‌గ్గ‌ర అవుతున్నారా ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న అంశం.. ఈస‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. బీజేపీ హిందువుల పార్టీ కాదని… ఒక రాజకీయ పార్టీ అని పవన్‌ పేర్కొన్నారు. కాకినాడలో ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని జవహర్‌ అలీ అనే న్యాయవాది పవన్‌ను కోరారు.

Image result for bjp
దీనిపై పవన్‌ స్పందిస్తూ… బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు.. అదొక రాజకీయపార్టీ. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు… ఆ పార్టీ సంఘ్‌తో ఉంటుందని చాలామంది చెప్పారు. అలాగైతే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం. ఇదే టీడీపీ గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించింది. ఆ తర్వాత మళ్లీ చేతులు కలిపింది. ప్రాంతీయ పార్టీలు వాటిలో ఏదో ఒకదానితో కలవాల్సిందే. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు భయపడాలి అని తెలిపారు. సినిమా థియేటర్‌లో జనగణమన ప్రదర్శనను పవన్‌ తప్పుపట్టారు..తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్.