బీజేపీతో వైసీపీ పొత్తుపై సాయిరెడ్డి క్లారిటీ

377

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు బీజేపీకి, జ‌న‌సేన- వైసీపీ స‌పోర్ట్ చేస్తుంది అనే విమ‌ర్శ అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది… ఇది ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తోంది… కాని ఇటు వైసీపీ కాని జ‌న‌సేన కాని బీజేపీతో అంటి ముట్ట‌న‌ట్టే ఉంటున్నారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Image result for bjp

కడపలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాష, కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, మేయర్‌ సురేష్ బాబు మాజీ ఎంపీలు వైఎస్‌ అవినాష్ రెడ్డి, పి.మిధున్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని పటిష్ట పరిచేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా కడపకు వచ్చినట్లు తెలిపారు. వైయ‌స్సార్ బ‌తికి ఉంటే ఈపాటికి క‌డ‌ప‌కు ఉక్కుఫ్యాక్ట‌రీ వ‌చ్చేది అని ఆయ‌న తెలియ‌చేశారు.