బాలయ్య క్షమాపణ వీడియో వైరల్

267

బాలయ్య ఏం చేసినా సంచలనమే …తాజాగా మీడియా ప్రతినిధిపై చేయిచేసుకున్న వివాదంలో చిక్కుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ… నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధిపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. 12 గంటలుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… అంతేకాదు పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్లు వస్తున్నాయి, ఈ సమయంలో ఎన్నికల్లో ఓట్లపై ఎఫెక్ట్ పడుతుంది అని భావించారు టీడీపీ నేతలు. దీంతో బాలయ్య మీడియా వారికి క్షమాపణ తెలియచేశారు.

Image result for balakrishna

‘‘మీడియా మిత్రులకి నమస్కారం.. నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య పోస్ట్ చేశారు.