బాబు పై రోజా ఘాటు విమ‌ర్శ‌లు

342

వైసీపీలో మ‌హిళానాయ‌కురాలుగా ఉన్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్ర‌బాబుపై తెలుగుదేశం పార్టీపై పెద్ద స్ధాయిలో విమ‌ర్శ‌లు చేశారు.తాజాగా సీఎం చంద్రబాబుపై మరోసారి రోజా నిప్పులు చెరిగారు. దేశ చరిత్రలో విలువలు లేని నాయకుడు చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. తణుకులో ఆమె ఈ కామెంట్లు చేశారు.. ఎప్పుడైనా ఎక్క‌డైనా అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా సాధించలేని చంద్రబాబు దేశాన్ని ఉద్దరిస్తారంట అని ఆమె విమ‌ర్శించారు.

Image result for chandra babu

ఇక్క‌డ ఏమీ చేయ‌లేదు దేశ రాజ‌కీయాల‌ను శాసిస్తాను అని కామెంట్లు చేస్తున్నాడు చంద్ర‌బాబు అని ఆమె విమ‌ర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టింది నిజం కాదా? గ‌తంలో ఏపీని తెలంగాణని విడ‌గొట్టిన పార్టీతో చేతులు క‌లిపి ఏపీకి వారు న్యాయం చేస్తారు అని చెప్ప‌డంపై ప్ర‌జ‌లు న‌వ్వుతున్నారు అని విమ‌ర్శించారు.. దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడు చంద్రబాబు అని కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేయలేదా? అని నిలదీశారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు ఎలా మ‌ర్చిపోతారు అని ఆమె విమ‌ర్శించారు.