బాబు నివాసానికి పెనుముప్పు చంద్రబాబు ఇంట్లో వరద

90

దాదాపు పదేళ్ల తర్వాత కృష్ణమ్మా తన ప్రతాపం చూపిస్తూ ముందుకి ఉరకలేస్తుంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ నది పరివాహక ప్రాంతం మొత్తం జల కళని సంతరించుకున్నాయి. కృష్ణ నదిపై కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తిగా గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం,నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఓపెన్ చేసి నీళ్లు కిందకి వదులుతున్నారు. అవి సరాసరి ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటున్నాయి. పులిచింతల నుండి భారీ నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజి లోకి వస్తుంది.ఇదే సమయంలో కృష్ణ నది కరకట్ట మీద కట్టిన అనేక భవనాలు నీటమునిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉంటున్న భవనానికి ముప్పు ఉన్నట్లు తెలుస్తుంది.కృష్ణ నదికి భారీ వరదలు వస్తే ముందుగా బంపర్ జోన్ ని ముంచెత్తుతాయి. సరిగ్గా అదే ప్రాంతంలో చంద్రబాబు ఉంటున్న హౌస్ ఉంది. 2014 లో సీఎం అయినా తర్వాత దానిని గెస్ట్ హౌస్ గా తీసుకున్నారు చంద్రబాబు , ఆ తర్వాత దానినే ఇంటిగా వాడుకుంటున్నాడు. దాని పక్కనే ప్రజా వేదిక కట్టారు. జగన్ సీఎం అయినా తర్వాత అది అక్రమ కట్టటం అని కూల్చివేసిన విషయం అందరికి తెలుసు.

ఈ క్రింద వీడియో చూడండి

వరద ముప్పు ఉందని తెలియడంతో, చంద్రబాబు ఇంటి వద్ద రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరుకుంది. చంద్రబాబు నివాసాన్ని వరద నుంచి కాపాడేందుకు ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. తెల్లవారుజామున వరద ఉధృతి పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సామాగ్రిని పై అంతస్తుకు తరలించినట్లు తెలిసింది. ప్రమాద తీవ్రతను ముందుగానే గమనించిన చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ వెళ్లిపోయింది. చంద్రబాబు వాహన శ్రేణిని మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీరిసార్ట్స్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. కృష్ణా నదీ కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి తరలివచ్చిన చంద్రబాబు…అప్పటి నుంచి ఈ గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. అయితే ఇంత భారీ స్ధాయిలో వరద నీరు ఎప్పుడూ ఇంటి పరిసరాలలోకి రాలేదు. అయితే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నాడు. అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోర్ట్ కూడా ఇటీవల ఆదేశించింది.ఇటీవల జగన్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. అంతే కాదు చంద్రబాబు ఇంటికి కూడా అధికారులు నోటీసులు అంటించారు.అయినా ఆ ఇంటి నుంచి చంద్రబాబు వదిలి వెళ్లడం లేదు.

Image result for chandrababu house in vijayawada

సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతున్నందున పులిచింతలకు వరద నీరు భారీగా వస్తోందని, అక్కడి నుంచి 6లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కృష్ణా నది కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ప్రకాశం బ్యారేజ్ అధికారులు అప్రమత్తయం అయ్యారు.కర్ణాటకలో వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేసి నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు వదలని ఆ ఆక్రమ నివాసం వరద ముంపుకు గురవుతుందనే వార్త…ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరో పది రోజుల పాటు సాధారణస్ధితి ఉండదు అని చెబుతున్నారు అధికారులు.