బాబు ఇలాంటోడని తెలిస్తే వేరేలా ఉండేవాడిని..పవన్ సంచలన వ్యాఖ్యలు…

791

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలవంతపు భూ సేకరణ ను అంగీకరించేది లేదని స్పష్టం చేసారు…రైతులు స్వచ్చందంగా భూలు ఇస్తేనే తీసుకోవాలని సోచ్చించారు..వైజాగ్ స్టీల్ ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే వారికి అండగా ఉండి పోరాటం చేస్తానని చెప్పారు.

గ్రామసభలు నిర్వహించి రైతుల అనుమతి తో భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్..బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలబడతానని పవన్ అన్నారు..ప్రభుత్వం బెదిరిస్తే బెదిరిపోవద్దని రైతులకు తానూ అండగా నిలబడతానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు…పోలీసులతో బెదిరించాలని చూస్తె మొదటి తూటా నా గుండెలోకే దిగాలని ఆయన ఎదురు నిలబడతానని చెప్పకనే చెప్పారు..

భూములను కొద్దిమంది చేతుల్లో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని పవన్ చెప్పారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దన్నారు. అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరానికి మించి రాజధాని కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేను వేరేలా ఉండేవాడినని పవన్ చెప్పారు. మద్దతిచ్చేవాడిని కాదన్నారు.

అభివృద్ధికి వ్యతిరేకమని తెలిస్తే తాను టిడిపికి మద్దతు ఇచ్చి ఉండేవాడిని కాదని పవన్ అన్నారు. భూసేకరణ చేస్తే ఎదురు తిరగండని రైతులకు సూచించారు. భూసేకరణ జరిగితే చెప్పండని, మీతో కలిసి నేను కూడా ఆందోళన చేస్తానని చెప్పారు. భూములు లాక్కోవడానికి చూస్తే నేను ప్రాణాలు ఇచ్చేందుకు ముందు ఉంటానని తెలిపారు. అవసరానికి మించి భూమిని తీసుకుంటే జనసేన ముందుండి పోరాడుతుందన్నారు.

విభజన సమయం నుంచి అవిశ్వాస తీర్మానం వరకూ టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిందని పవన్ ట్విటర్లో విమర్శించారు. పద్దతి పాడు లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీలోని యువతరంతో పాటు సాధారణ ప్రజానీకం ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికంగా వెనుకబడి పోయిందన్నారు. ఈ సమయంలో టీడీపీ నాయకత్వం ఏపీ ప్రజల పట్ల మరింత బాధ్యతగా వ్వవహరించాల్సి ఉందన్నారు. హోదా అంశంలో కేంద్ర వైఖరిని తిరుపతి బహిరంగసభ వేదికగా తాను నిరసించినపుడు టీడీపీ తరపున వినిపించిన వాదనలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన ట్విటర్లో ఉంచారు.