బాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన -కేటీఆర్

299

ఏపీ తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం పెను వివాదంగా మారింది… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ టైమ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకి అడ్డంగా దొరికిపోవడం తర్వాత బుకాయించడం అలవాటుగా మారిపొయింది అని విమర్శించారు ఆయన .. ఏపీ ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీ చోరీ చేసిందని లోకేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేయడంతోనే కేసు నమోదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు ..టీఆర్ఎస్పై టీడీపీ చేస్తున్న విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు.

Image result for chandra babuఈ అంశంలో చంద్రబాబు తప్పు చేయకపోతే భయమెందుకు?. చంద్రబాబుకు దమ్ముంటే విచారణకు ముందుకురావాలి. ఐటీ గ్రిడ్ సంస్థ తప్పు చేయకపోతే భయమెందుకు?. తప్పు చేయకపోతే క్లీన్ చీట్ కూడా ఇస్తారు. వ్యక్తిగత సమాచారం సేవా మిత్ర యాప్లోకి ఎలా వెళ్లిందో ఏపీ ప్రజలు ప్రశ్నించాలి. ఇది ప్రజలకు కచ్చితంగా ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఆయన అన్నారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటి..?. చేసింది తప్పు.. మళ్లీ మా ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు. మా మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మీ డేటాతో మాకేం పని.. ప్రజల్లో పరపతి పోయాక బాబు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారు. అని విమర్శించారు ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు అని ఆయన అన్నారు.