బాబుకు బాల‌య్య‌కు రోజా సూటి ప్ర‌శ్న

381

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ వేడెక్కింది ..ఓపక్క రాహుల్ గాంధీ, మ‌రో ప‌క్క చంద్ర‌బాబు, మ‌రో ప‌క్క కేటీఆర్ కేసీఆర్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.. ఇక నంద‌మూరి సుహాసిని కూక‌ట్ ప‌ల్లి నుంచి నిల‌బ‌డిన ఆమె గెలుపు కోసం నందమూరి ఫ్యామిలీ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది… ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు పప్పు అయినా ఆ కొడుక్కే పదవులిచ్చుకుంటారు కానీ, నందమూరి కుటుంబ సభ్యులు ఆ పార్టీ కోసం ఎంత కష్టపడినా పదవులు మాత్రం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారా? బాలయ్య అసెంబ్లీకి రారు, ఆయన నియోజకవర్గమైన హిందూపురం వెళ్లరు, కానీ, తెలంగాణలో మాత్రం ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు అని ఎమ్మెల్యే రోజా విమ‌ర్శించారు.

Image result for balayya and chandra babu

తెలంగాణ ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి నందమూరి సుహాసినిని తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయంగా బలి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా బాలకృష్ణ తిరుగుతున్నారు. బతికున్నంత కాలం హరికృష్ణను అవమానించారు, వేధించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక చిన్న పదవైనా హరికృష్ణకు ఇవ్వలేదు. హరికృష్ణ కుటుంబంపై ప్రేమే ఉంటే.. జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను మంత్రులను చేయొచ్చుకదా పోని ఆ కుటుంబానికి ఏపీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌చ్చుక‌దా అని ఆమె ప్ర‌శ్నించారు.