బాబుకు ఇక టెన్ష‌న్ – ఆనం కౌంట‌ర్

411

తెలంగాణ‌లో కేసీఆర్ ప‌రిపాల‌న‌తో మ‌రో కొత్త శ‌ఖం రెండోసారి ప్రారంభం అవుతోంది అని తెలంగాణ ప్ర‌జ‌లు చెబుతున్నారు..ఇక ఏపీలో కూడా చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఫెయిల్ అవుతారు అనివిమ‌ర్శిస్తున్నారు వైసీపీ నేత‌లు…తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలుపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో తడబాటు, అభద్రతబావం నెలకొందని వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్‌, మాజీ మంత్రి ఆనం రామనారా యణరెడ్డి అన్నారు. తెలంగాణలో పోరాటం చేసింది మోదీతో అని టీఆర్‌ఎస్‌తో కాదని 15రోజుల తరువాత చెప్పడం వి డ్డూరంగా ఉందన్నారు.

Image result for ఆనం రామనారా యణరెడ్డి

దీంతో ఆయనలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. నేడు టీఆర్‌ఎస్‌ గెలవడం అంటే అక్కడ సెంటి మెంట్‌ పనిచేసిందన్నారు. తెలంగాణల్లో చంద్రబాబు పన్నాగాలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. ఆఖరికి ఎన్‌టీఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేశావని అన్నారు. వ చ్చే ఎన్నికల్లో ఓడిపోతే చేసిన ఈ దోపిడీ బయట పడుతుందని, దాంతో ప్రజలు నడిరోడ్డుకి లాగుతారని చంద్రబాబు నాయుడు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.వ్య‌వ‌స్తల‌ను భ్ర‌ష్టుప‌ట్టించారు అని ఆయ‌న విమర్శించారు.