బడ్జెట్ 2019-20 హైలెట్స్

66

2019-20 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్ను ఇన్చార్జ్ ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు.కేంద్రం ఎన్నికల సమయం కావడంతో ఈ ఏడాది బడ్జెట్ పై ఫోకస్ పెట్టింది, వరాలు ప్రకటించింది అనే చెప్పాలి.. దేశ ప్రజలకు అయితే కొందరికి ఈ బడ్జెట్ నిర్ణయాలు ఆశాజనకంగా ఉన్నాయి.

Image result for బడ్జెట్ 2019-20 హైలెట్స్
పీయూష్ తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉండటంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఆరో బడ్జెట్. ఎన్నికల నేపథ్యంలో గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్ హైలెట్స్ తెలుసుకుందాం.

బడ్జెట్లో గోయల్ ప్రస్తావించిన ప్రధానాంశాలు:
ప్రజల ఆదాయం రెట్టింపు కావాలి
ఉగ్రవాద, మతవాద రహిత దేశంగా అవతరించాలి
వృద్ధిరేటు వేగం పుంజుకుంది
ప్రపంచంలో మనది ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ
యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం 10శాతం దాటింది
ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.6శాతానికే పరిమితం
గత ఏడాది డిసెంబర్లో ద్రవ్యోల్బణం 2.19శాతం మాత్రమే
సహకార సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు తగిన నిధులిస్తాం
జీఎస్టీ సహా పన్నుల సంస్కరణలపై దృష్టి
బ్యాంకుల నిజస్థితిని దేశం ముందుంచాలని ఆర్బీఐని కోరాం
క్లీన్ బ్యాంకింగ్ మా లక్ష్యం
రూ.3లక్షల కోట్ల మొండి బాకీలు వసూలు
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాం
దీనివల్ల విద్యాసంస్థల్లో 2లక్షల సీట్లు పెరుగుతాయి
గ్రామీణ, పట్టణ అంతరాలను తొలగించడమే మా ధ్యేయం
గ్రామాల్లో పట్టణ సదుపాయాలు కల్పిస్తాం
ప్రధాని గ్రామ సడక్ యోజన ద్వారా రోడ్ల నిర్మాణం మూడింతలు పెరుగుదల
మారుమూల ప్రాంత గ్రామాలకూ బస్సులు
దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం
143కోట్ల ఎల్ఈడీ బల్బులు అందించాం
ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం
హర్యానాలో కొత్తగా ఎయిమ్స్ ఏర్పాటు
రైతులకు కనీస మద్దతు ధర 50శాతం పెంచాం
రైతుల ఆదాయం రెట్టింపు
చిన్న సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్ పథకం
రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6వేలు పంటసాయం
రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు
నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది
దీని వల్ల 12కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది
2018 డిసెంబర్ నుంచే ఈ పథకం అమలు
మొదటి విడతగా రూ.2వేలు తక్షణమే ఇస్తాం
మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ
గోవుల సంతతి పెంచడానికి కామధేను పథకం
కామధేను పథకానికి రూ.750కోట్లు
గోరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం
ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు చేస్తాం
పశు, చేపల పెంపకం రైతులకు రెండు శాతం వడ్డీ సబ్సిడీ
ప్రకృతి వైపరీత్యాల బాధిత రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ
సకాలంలో రుణాలు చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డీ రాయితీ
జీడీపీలో 42శాతం శ్రామికుల నుంచే వస్తోంది
ప్రధానమంత్రి శ్రమ్ జ్యోతి మాన్ధన్పేరుతో కొత్త పెన్షన్
కనీస పెన్షన్ రూ.3వేలు
18ఏళ్లు దాటినవారు నెలకు రూ.55, 39 ఏళ్లు దాటిన వారు నెలకు రూ.100 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో పెన్షన్ ఫండ్కు జమచేస్తుంది
గ్రాట్యుటీ రూ.20లక్షలకు పెంపు
కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు
ముద్ర స్కీం కింద రుణాలకు రూ.7 లక్షల కోట్లు
గ్రాట్యుటీ పరిధి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు
మహిళల నేతృత్వంలో మహిళాభివృద్ధి జరుగుతోంది
గ్రామీణ మహిళల సామాజిక పరిస్థితులు మెరుగుపరుస్తాం
ఇప్పటికే 6కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, 8కోట్లకు పెంచుతాం
స్టార్టప్స్లో దేశం రెండోస్థానంలో ఉంది
2019-20లో రక్షణ బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతుంది…అవసరమైతే మరిన్ని నిధులిస్తాం
ప్రపంచంలోనే అత్యధిక హైవేలున్న దేశం మనది
దశాబ్దాలుగా అగిపోయిన హైవేలు మేం పూర్తి చేశాం
రైల్వేలు బాగా మెరుగుపర్చాం
కాపలా లేని లెవల్ క్రాసింగ్లే లేవు
వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కుతుంది
మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం
బ్రాడ్ గేజ్లో కాపలా లేని గేట్లను తొలగించాం
మొబైల్ డేటా వినియోగం 50రెట్లు పెరిగింది
వాయిస్కాల్ ఖర్చు మనదేశంలో అతితక్కువ
సౌరశక్తి ఉత్పత్తి 10రెట్లు పెరిగింది
లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి
రైల్వే క్యాపిటిల్ ఔట్ లే రూ.64,500కోట్లు
ఈఎస్ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు
ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తాం
24గంటల్లో ఆదాయపన్ను రీఫండ్ వచ్చేలా చూస్తాం
ఆన్లైన్ వ్యవస్థను పటిష్టం చేస్తాం
రాష్ట్రాల పన్నుల వృద్ధిరేటు తగ్గితే లోటు కేంద్రం పూరిస్తుంది
ప్రత్యక్ష పన్నుల రాబడి 6.38లక్షల కోట్లకు పెరిగింది
2013-14నాటితో పోల్చితే దాదాపు రెట్టింపయింది
వచ్చే ఐదేళ్లలో మనది 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుంది
ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్లవుతుంది
ఈజ్ ఆఫ్ లివింగ్ను మెరుగుపర్చేందుకు మౌలికసదుపాయాలు కల్పిస్తాం
సినిమా థియేటర్లపై జీఎస్టీ 12శాతానికి తగ్గింపు
భారత్లో తీసే సినిమాలకు సింగిల్ విండో క్లియరెన్స్
ఎలక్ట్రికల్ కార్ల తయారీకి, అమ్మకాలకు ప్రోత్సాహం
చమురు వాడకం తగ్గితే దిగుమతులు తగ్గుతాయి
ఆర్థికభారం తగ్గుతుంది కాబట్టి ఆదిశగా చర్యలు
మేకిన్ ఇండియాలో భాగంగా ఆటో మొబైల్స్, డిఫెన్స్ రంగాలకు పోత్సాహకాలు
2022 నాటికి అంతరిక్షంలోకి మానవుడిని పంపే గగన్యాన్ పథకం
కనిష్ఠ ప్రభుత్వ జోక్యంతో గరిష్ఠ పాలన అందిస్తాం
జాతీయ విద్యా స్కీమ్కు రూ.38,570కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 76,800కోట్లు
ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166కోట్లు కేటాయింపు
రూ.5లక్షల వరకు పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు
పీఎఫ్ ఇతర సేవింగ్స్ స్కీమ్లలో ఇన్వెస్ట్ చేసేవారికి రూ.6.5లక్షల వరకు మినహాయింపు
రెండిళ్లు ఉన్నప్పటికీ అద్దెపై పన్ను మినహాయింపు
స్టాండెడ్ డిడక్షన్ రూ.50వేలకు పెంపు
3కోట్ల మంది మధ్యతరగతి వర్గాలకు ఊరట