బడ్జెట్ పై అరుణ్ జైట్లీ స్పందన

352

ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్పై స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశానికి విధానపరమైన మార్గదర్శకత్వం లభిస్తోందని పేర్కొన్నారు. వరుస ట్వీట్లతో ఆయన బడ్జెట్ పై తన అభిప్రాయం తెలియచేశారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దేశానికి ఇచ్చిన విధాన మార్గదర్శకాలలో కీలకాంశాలను నేడు పీయూష్ గోయల్ సమర్పించిన తాత్కాలిక బడ్జెట్ వెల్లడిస్తోంది అని ఓ ట్వీట్లో జైట్లీ పేర్కొన్నారు… గత ఐదు సంవత్సరాల్లో మంచి పాలన అందించాం ప్రజలకు చాలా చేశాం అని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాము అన్నారు జైట్లీ.

Image result for అరుణ్ జైట్లీ

అద్భుతమైన బడ్జెట్ను రూపొందించినందుకు పీయూష్ గోయల్కు అభినందనలు. ఈ బడ్జెట్ దేశం ముందు ఉన్న సవాళ్ళను సమగ్రంగా ఎదుర్కొనేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్తుంది’’ అని తెలిపారు.రైతులకి పేదవలకు కార్మికులకు ఉద్యోగులకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది అని ఆయన తన విషెస్ తెలియచేశారు