ఫిబ్ర‌వ‌రిలో మీ అంద‌రికి ఆ విష‌యం చెబుతా – ప‌వ‌న్

421

రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ గేర్ మారుస్తారా, లేదా అదే గేర్ లో వెళ‌తారా అనేది చూడాలి.. ఏపీలో త‌న స‌త్తా చాటుతున్న ప‌వ‌న్ తెలంగాణ ఎన్నిక‌ల‌కు దూరం అయ్యారు.. ఇక ఏపీలో ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు అనే విష‌యం పై క్లారిటీ లేదు, ఆరునెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఏపీలో ఎన్నిక‌లకు ఉంది… ఇక ఆయ‌న తాజాగా ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు అని మీడియా ఆయ‌న‌ని ప్ర‌శ్నించింది.

Image result for pawan kalayan

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ స్పష్టం చేశారు. నేతలంతా వారి అవసరాలకు తప్ప ప్రజల కోసం పార్టీలను నడపటం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో కరవు నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ అసెంబ్లీకి వెళ్లడం లేదని విమర్శించారు. జిల్లాలో కరవు సమస్యపై ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్‌ను పవన్‌కల్యాణ్‌ నిలదీశారు. ఇక రెండు నెల‌ల్లో ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి పోటీ చేసేది క్లారిటీ రానుంది.