ప‌వ‌న్ కు హోంమ‌త్రి రాజ‌ప్ప కౌంట‌ర్ ?ఇదేం ప‌ద్ద‌తి

456

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌లు ఉత్తుత్తి ప్ర‌సంగాలు మాత్ర‌మే అని తెలుగుదేశం పార్టీ నేత‌లు కొట్టిపారేస్తున్నారు.. తాజాగా ప‌వ‌న్ కు ఏపీ హొంమంత్రి చిన‌రాజ‌ప్ప చుర‌క‌లు అంటించారు…జనసేన సభలకు జనం రావడం లేదని, అందుకే పవన్‌ కల్యాణ్‌ రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.ఈ నాయ‌కులు అంద‌రూ ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న తపనతో మాట్లాడుతున్నారు. అదే త‌ర‌హాలో జ‌న‌సేన అధినేత పవన్‌ జనంలోకి వెళ్లి చప్పట్లు కొట్టించుకుంటున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. మంచి విష‌యాలు స‌భ‌ల్లో చెప్పాలి ఇలా జ‌నంతో చ‌ప్పట్లు కొట్టించుకోవ‌డం ఏమిటి అని విమ‌ర్శిస్తున్నారు జ‌నం అని ఆయ‌న వ్య‌గ్యంగా విమ‌ర్శించారు.

Image result for pawan kalyan
అభివృద్ది ప‌థంలో పంచాయ‌తీరాజ్ ఐటీ శాఖ‌ల‌ను తీసుకువెళుతున్న మంత్రి లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ, పవన్‌ మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలకు సినిమాపై ఆసక్తి ఉన్నట్లే.. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంటుందని వ్యాఖ్యానించారు…లోకేష్‌ను చంద్రబాబు వారసత్వం అని విమర్శిస్తున్న పవన్‌ తన అన్న చిరంజీవి ద్వారా నటుడయ్యాడన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. చిరంజీవి కుమారుడు, తమ్ముళ్లు, తమ్ముళ్ల కుమారులు, మేనళ్లుల్లు నటులు అయిన సంగతి మర్చిపోయినట్లున్నారని గుర్తు చేశారు.ప‌వ‌న్ అస‌లు నీకు రాజ‌కీయంగా ఏ అనుభ‌వం ఉంది చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేస్తున్నావో తెలుసుకోవాలి అని తెలుగుదేశం నేత‌లు చుర‌క‌లు అంటించారు.