ప‌వ‌న్ కు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ క్ ఝ‌ల‌క్

300

జ‌న‌సేన అధినేత సీని న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా ఎటువంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారో తెలుసుకోవాలి అని ఆయ‌న ఎద్దెవా చేశారు …శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ..ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్‌ కుమారుడినని పవన్‌ చెప్పుకుంటున్నారని విమర్శించారు.. చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

Image result for anil kumar yadhav

కులం గురించి చెప్పుకోకుండా ప‌వ‌న్ ప్ర‌సంగాలు ఎక్క‌డా ముగియ‌వు అని ప్ర‌తీ ప్ర‌సంగంలోని కులం గురించి చెప్పుకుంటుంది ప‌వ‌న్ క‌ల్యాణ్ అని ఆయ‌న విమ‌ర్శించారు… ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న జ‌గ‌న్ పై తెలుగుదేశం జ‌న‌సేన కావాల‌నే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి అని ఆయ‌నకు వ‌స్తున్న జ‌నాల్ని చ‌రిష్మాని చూసి ఈ రెండు పార్టీలు త‌ట్టుకోలేక‌పోతున్నాయి అని విమ‌ర్శించారు.