ప‌వ‌న్ కు లోకేష్ కౌంట‌ర్

428

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ మంత్రి నారాలోకేష్ పై చేసే విమ‌ర్శ‌లు ఇటీవ‌ల మ‌రింత హీట్ పెంచుతున్నాయి.. పోలిటిక‌ల్ గా ఆ విమ‌ర్శ‌ల‌పై ఇటు తెలుగుదేశం కూడా జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు చేస్తోంది.. ఇటు ప‌వ‌న్ త‌మ మంత్రి పై చేసే ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాలు లేవు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. వాటిని ఖండిస్తున్నారు. ఎటువంటి నిజాలు అందులో లేవు ఒక‌వేళ మీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలి అని వారు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా మంత్రి లోకేష్ వీటిపై విమ‌ర్శ‌లు చేశారు ప‌వ‌న్ కు కౌంట‌ర్లు ఇచ్చారు.

Image result for lokesh
తనపై పదేపదే ఆరోపణలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వాటికి ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారని టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. తమ కుటుంబ ఆస్తుల ప్రకటన సందర్భంగా ఆయన ఇక్కడ ప్రజా వేదిక భవనంలో విలేకరులతో మాట్లాడారు. ‘పవన్‌పై నాకు చాలా గౌరవం. ఆయన నాపై ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలు చూపాలని ఏడెనిమిదిసార్లు సవాల్‌ చేశాను. కానీ చూపించలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మాపై పాతిక కేసులు వేశారు. ఒక్కటీ నిలవలేదు. ఆయన అధికారంలోకి వచ్చాక 11 సభాసంఘాలు, 4 కేబినెట్‌ సబ్‌ కమిటీలు, 4 అధికారుల విచారణలు, 3 న్యాయ విచారణలు, ఒకసీబీసీఐడీ విచారణ వేశారు. అయినా ఏమీ తేల్చలేకపోయారు.

Image result for pawan kalyan chennai

ఇక త‌మ‌పై గత ఎన్నికల ముందు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి మాపై 2,490 పేజీల పిటిషన్‌ వేశారు. కోర్టు కొట్టివేసింది’ అని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు కోర్టు స్వాధీనంలో ఉంటే వాటిని తానె లా కొనగలనని విస్మయం వ్యక్తం చేశారు.. దీనిపై ప‌వ‌న్ మ‌రోసారి ఇలా కామెంట్లు చేసే స‌మయంలో వాస్త‌వాలు తెలుసుకోవాలి అని ఆయ‌న అన్నారు..