ప‌ప్పు అంటూ ఎమ్మెల్యే రోజా కామెంట్లు

445

ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత గ‌ద్దెనెక్కారు అని విమ‌ర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఏపీ ప్ర‌జ‌లు బాబు పాల‌న‌పై విసుగుచెందారు అని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేల‌కు అప‌జ‌యం త‌థ్యం అని ఆమె విమ‌ర్శించారు. ప్రజలను మోసం చేసి సీఎం చంద్రబాబు గద్దెనెక్కారని మ‌ళ్లీ సీఎం అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అని ఆమె విమ‌ర్శించారు.

Image result for rahul gandhi

చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ.. బాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాల్సిందేని ఎద్దేవాచేశారు. తెలుగు పప్పు లోకేష్‌కు తోడుగా రాహుల్‌ పప్పు చేరారని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలవకుండా చేయాలని, చంద్రబాబు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు, పచ్చి నవ్వులు నవ్వుతున్నారని రోజా పేర్కొన్నారు.