ప్రముఖ కాంగ్రెస్ నేత హఠాన్మరణం…విషాదంలో రాహుల్ సోనియా

535

వెటరన్ కాంగ్రెస్ నేత ఇందిరా గాంధి సన్నిహితుడు ఆర్ కె ధావన్ తుదిశ్వాస విడిచారు..ఆయన వయసు 81 సంవత్సరాలు..గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆయనను డిల్లీ లోని బి ఎల్ కపూర్ హాస్పిటల్ లో చేర్చారు..ప్రస్తుతం చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా, ఆమె పర్సనల్ సెక్రటరీగా థావన్ పనిచేశారు.

1984లో ఆమె హత్య కేసులోనూ కీలక సాక్షిగా ఉన్నారు. నావికాదళ మాజీ అధిపతిగా, రాజ్యసభ సభ్యుడిగా థావన్ సేవలందించారు. పార్టీ సిద్ధాంతాలకు అంకితమై, తుది శ్వాస వరకూ అవిశ్రాంతగా పనిచేసిన థావన్ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు.