ప్రత్యేక హోదా రాజకీయ లబ్ది కోసమే..పవన్ పై శివాజీ ఘాటు వ్యాఖ్యలు…

455

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటుడు శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేసారు..అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్ పై కూడా విమర్శలు గుప్పించారు..రాజకీయం ఎన్నికల్లో లబ్ది కోసమే ప్రత్యెక హోదా అంశాన్ని జగన్ పవన్ వాడుకుంటున్నారని శివాజీ ద్వజమెత్తారు…అన్యాయం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే ఫలితమేంటని ప్రశ్నించారు..

హోదాపై చిత్తశుద్ధి ఉంటే రైళ్లు ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్తంభింపజేసేందుకు తాను సిద్ధమని.. వారు సైతం కలిసి రావాలని శివాజీ సవాల్ విసిరారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, గట్టిగా, ఐక్యంగా నిలబడితే హోదా అదే వస్తుందని అన్నారు. ఇక ప్రధాని మోదీ 54 దేశాలు తిరిగినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, చంద్రబాబు లక్ష కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలను కొత్త రాష్ట్రానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు శివాజీ