పోలవరం ప్రాజెక్ట్ పై నవయుగ సంచలన నిర్ణయం..జగన్ కు షాక్

56

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుపై కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంపై ఆరా తీస్తోంది. రివర్స్ టెండరింగ్ వివరాలు.. పాత టెండర్ల రద్దుకు సంబంధించి సమగ్ర నివేదికను త్వరలోనే అందజేయాలని పోలవరం అథారిటీని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఎలాంటి చర్యలకు దిగుతుందోనన్న చర్చ జరుగుతోంది.

Image result for polavaram

నిజానికి రివర్స్ టెండరింగ్‌పై పీపీఏ అభ్యంతరం తెలిపినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అంచనా వ్యయం పెరిగిందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ప్రజాధనం ఆదా చేయడమే రివర్స్ టెండరింగ్ ఉద్దేశం అని చెప్పింది. ఈ మేరకు మొత్తం రూ.4,987.5 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలను పీపీఏ కేంద్రానికి పంపించింది. దీంతో రివర్స్ టెండరింగ్ అవసరం ఏమొచ్చిందని కేంద్రం ఆరా తీస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు, చెల్లించాల్సిన బిల్లులు వంటి లెక్కలు తెలపాల్సిందిగా పీపీఏని అడిగింది. పీపీఏ నివేదిక అందిన తర్వాత కేంద్రం పోలవరంపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ప్రభుత్వంలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కేంద్రం గనుక జగన్ నిర్ణయానికి ప్రతికూలంగా స్పందిస్తే ప్రభుత్వానికి అది పెద్ద దెబ్బే అని చెప్పాలి.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక మరో పక్క కేసు కూడా తాజాగా ఫైల్ అయింది.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్ ప్రక్రియ కోసం పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. పనులను హఠాత్తుగా నిలిపేయటంతో అప్పటి వరకూ పనులను చేసిన నవయుగ కంపెనీ ప్రిస్టేజ్ ఫీలైంది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు హై కోర్టులో కేసు వేసింది. పనులనుండి తమను తప్పించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదంటూ వాదిస్తోంది.సిఎం నిర్ణయంతో తమ సంస్ధకు ఆర్దికంగా నష్టం జరగటమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతింటోందంటూ మండిపోయింది. కాబట్టి పనులను ఇతర సంస్ధలు కాకుండా తామే చేపట్టేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతు నవయుగ కోర్టును అభ్యర్ధించింది.

Image result for polavaram

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నవయుగ కంపెనీకి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును చంద్రబాబు నామినేషన్ పై అప్పగించారంటేనే అర్ధమైపోతోంది వాళ్ళ బంధం. జగన్ చెప్పినట్లుగా ప్రాజెక్టు పనుల్లో భారీగానే అవినీతి జరిగి ఉండచ్చు. కానీ దాన్ని నిరూపించటం అంత సులభం కాదన్న విషయం జగన్ గ్రహించాలి. ఇటువంటి వ్యవహారాలు నడపటంలో చంద్రబాబు ఆరితేరిపోయారు.

Image result for polavaram

కోర్టులో నవయుగ కంపెనీ కేసు వేయటం వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉండచ్చు. కోర్టులో కేసు వల్ల జగన్ రివర్స్ టెండరింగ్ ఆలోచనలు ముందుకు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయనటంలో సందేహం లేదు. అసలే కేంద్రం, పోలవరం అథారిటి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళని కాదని జగన్ ముందుకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఇపుడు బంతి కోర్టులో పడటంతో తనిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ కు అవకాశాలు లేవు. తాజాగా కేసు వల్ల జరగబోయేదేమిటంటే పోలవరం పనుల్లో జాప్యం, వ్యయాలు పెరిగిపోవటం అంతే. మరి మీరేమంటారు పోలవరం ఎప్పుడు అవుతుందో ఏమిటో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.