పోలవరం ప్రాజెక్ట్ టెండర్ విషయంలో జగన్ కు కేంద్రం సీరియస్ వార్నింగ్

111

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైన్ సూచనలు బేఖాతరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. . ఆగస్టు 17 వ అంటే నేడు తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఆయన చెప్పిన అంశాలను లెక్క చెయ్యకుండా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు జగన్. అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సి ఈ వో గా ఉన్న ఆర్కే జైన్ మరోమారు ప్రభుత్వాన్ని ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు .

Image result for jagan

ఒకపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముందని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్ కె జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తున్న కంపెనీల పనితీరు కూడా బాగానే ఉన్నట్టు పేర్కొన్న ఆయన . రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం వల్ల పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని, ఖర్చు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించడానికి వేసిన నిపుణుల కమిటీకి ఉన్న ప్రాతిపదిక ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తో ఏకీభవించని సీఈవో జైన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో రివర్స్ టెండరింగ్ విధానంలో ఉన్న ఇబ్బందులను గురించి తాము ఏపీ ప్రభుత్వానికి సూచించామని ఆయన పేర్కొన్నారు. అలా రీ టెండరింగ్ కు వెళ్తే నష్టం తప్ప లాభం లేదని చెప్పారు.

Image result for jagan

జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చేసిన సూచనలు పట్టించుకోవడం లేదు.. తాను ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించిన మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక అందులో భాగంగా ఈనెల 17వ తేదీన రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. హెడ్ వర్క్స్ లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు కాకుండా, మిగిలిన పనులతో పాటుగా హైడల్ ప్రాజెక్టు ను కలిపి టెండర్లను పిలవనున్నారు మొత్తం 5070 కోట్ల పనులను రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇక ఈ నేపధ్యంలో మరోసారి పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సి ఈ వో ఆర్కే జైన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆలోచన విరమించుకోవాలని లేఖ రాశారు. దీంతో నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

ఈ క్రింద వీడియో చూడండి

శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు.ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పిందని , ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే రివర్స్ టెండరింగ్ వద్దని పీపీఏ సూచించింది.ఇక అలాగే ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ కోరారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా రివర్స్ టెండరింగ్ విధానాన్ని నిలిపివెయ్యాలని ఆయన లేఖలో కోరారు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. మరి ఈ రోజు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని భావిస్తున్న నేపధ్యంలో పీపీఏ సిఈ ఓ జైన్ లేఖ రాయటం ప్రభుత్వ వర్గాలను ఆలోచనలో పడేసింది. ఈ లేఖ అందిన నేపధ్యంలో రీ టెండరింగ్ విషయంలో జగన్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.